ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే రెండు కోట్ల 25లక్షల మంది దాక వైరస్ బారిన పడగా 7లక్షల 38వేల 700మంది దాక మృతి చెందారు. యాక్టీవ్ కేసుల సంఖ్య 64లక్షలకు చేరగా..కోటీ 31లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. అమెరికాలో లక్షా 66వేల 195మంది కరోనాతో మరణిస్తే..బ్రెజిల్ లో లక్షా వెయ్యి 900మంది చనిపోయారు. మెక్సికోలో 53వేలమందికి పైగా చనిపోతే స్పెయిన్ లో 28వేల 576మంది, రష్యాలో 15వేల మంది, పెరూలో 21వేల 72మంది, కొలంబిచాలో 13వేల 155మంది కన్నుమూశారు. యూకేలో 46వేల 526మంది ప్రాణాలు కోల్పోతే.. ఇటలీలో 35వేల 209మంది, ఇరాన్ లో 18వేల 616మంది, ఫ్రాన్స్ లో 30వేల 340మంది కరోనా కాటుకు బలయ్యారు.