బంగ్లాదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో 54మంది మృతి చెందారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు.. 56వేల మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలతో ఆగమాగమవుతున్న బంగ్లాదేశ్ ను అన్ని విధాల ఆదుకుంటామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. వరద విపత్తుతో అల్లాడుతున్న బంగ్లాదేశ్ కు మానవత్వంతో ఆహారం, మంచినీరు అందించాలని పిలుపునిచ్చింది.