28.4 C
Hyderabad
Thursday, October 29, 2020

బకాయిలను వెంటనే విడుదల చేయండి: కేటీఆర్

తెలంగాణకు నిధుల విడుదల విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ .. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. వెంటనే బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని పట్టణాలకు రావలసిన గ్రాంట్లకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరారు మంత్రి కేటీఆర్. 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని మిలియన్ ప్లస్ నగరాల కేటగిరి లో ఉన్న హైదరాబాద్ కు..  468 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే ఇతర పట్టణాలకు 421 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఈ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉందని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ నిధుల కేటాయింపును కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందన్న కేటీఆర్.. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ని పార్లమెంటులో సైతం ప్రవేశపెట్టారని కేంద్ర మంత్రికి గుర్తుచేశారు. ఇందులో హైదరాబాద్ కి రావాల్సిన నిధుల్లో ఇప్పటిదాకా ఒక్క రూపాయి విడుదల కాలేదన్నారు. మిగిలిన నగరాలకు సంబంధించి కేవలం 105 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా విడుదలయ్యాయని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.

కరోనా సంక్షోభంలో రాష్ట్రా లు కూడా ముందువరుసలో ఉండి పోరాడుతున్నయని చెప్పారు మంత్రి కేటీఆర్. దీంతో పాటు ఆర్థిక కార్యకలాపాలను  తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలోని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుందన్నారు. వీటికి సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ ను కూడా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించామన్నారు. అయితే ఆయా పథకాలకు సంబంధించి కేంద్రం యొక్క నిధులు రాకపోవడంతో నిధుల కొరతను ఎదుర్కొంటున్నామని చెప్పారు.  ఆయా కార్యక్రమాలను వేగంగా కొనసాగించడం కొంత ఇబ్బందిగా మారిందని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకొచ్చారు మంత్రి కేటీఆర్.

గతంలో 14వ ఆర్థిక సంఘం సూచించిన 2714 కోట్ల రూపాయలకు బేసిక్ గ్రాంట్ కి గానూ కేంద్రం కేవలం 2502 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు మంత్రి కేటీఆర్. అప్పుడు కూడా 208 కోట్ల రూపాయల నిధులను కేంద్రం రాష్ట్రానికి చెల్లించలేదన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నా..  కేంద్రం నుంచి నిధుల రాకలో జాప్యం జరిగిందన్నారు. దీంతో పాటు 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి పర్ఫామెన్స్ గ్రాంట్ కింద రావాల్సిన నిధుల్లో 441 కోట్ల రూపాయల బాకీ ఉందని చెప్పారు. ఇలా మొత్తం 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి 650 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. అయితే స్థానిక పట్టణ సంస్థలకు రావాల్సిన ఈ గ్రాంట్ల ను ఇతర రాష్ట్రాలకు పూర్తిగా చెల్లించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.

మొత్తం బకాయిలను చూస్తే…  రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి హైదరాబాద్ కు రావాల్సిన 468 కోట్లు, ఇతర పట్టణాలకు రావాల్సిన 315 కోట్లు,14వ ఆర్థిక సంఘానికి సంబంధించి 650 కోట్ల రూపాయలు… మొత్తంగా సుమారు 1,434 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు మంత్రి కేటీఆర్. అలాగే తన లేఖను కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి కూడా పంపించారు.

- Advertisement -

Latest news

Related news

ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత

నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత గురు‌వారం మ‌ధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంట‌లకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి.. ఆమె...

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్  ప్రారంభించారు. రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే...

స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఎస్పీ, బీఎస్పీల మిత్రుత్వానికి ఫుల్‌ స్టాప్ ప‌డింది. స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వ‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ప్ర‌క‌టించారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో...

చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోన్న భారీ వర్షాలు

భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌ లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా...