డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా బాలీవుడ్ స్టార్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రియా చక్రవర్తి టాలెంట్ మేనేజర్ జయాను ఎన్సీబీ అధికారులు విచారించిన సమయంలో…ఆమె పలువురు స్టార్ల పేర్లు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె వాట్సాప్ చాట్లో బాలీవుడ్ నటి దిపికా పదుకొనే పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ సహా పలువురికి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు జారీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తాజాగా దిపిక పేరు కూడా తెరపైకి రావడం కలకలం సృష్టిస్తోంది. సుశాంత్ మృతి కేసులో విచారణలో భాగంగా ఎన్సీబీ పలువురిని విచారించింది. రియా చక్రవర్తితో పాటూ ఆమె సోదరుడు, పలువురు డ్రగ్స్ డీలర్లను అదుపులోకి తీసుకుంది. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరికి సమన్లు జారీ చేసే అవకాశముంది.