19.5 C
Hyderabad
Friday, November 27, 2020

బిహార్‌ సీఎంగా మళ్లీ నితీశ్‌

బీహార్‌ సీఎం పదవి వరుసగా నాలుగోసారి నితీష్‌ కుమార్‌నే వరించింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన పాట్నాలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా నితీశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా.. వాటిలో ఎన్డీయే పక్షాలకు 125 సీట్లు దక్కాయి. గత అసెంబ్లీతో పోల్చి చూస్తే నితీశ్‌ పార్టీ జేడీ–యూ బలం 71 నుంచి 43కి పడిపోయింది. అయినప్పటికీ ముందుగా చేసిన నిర్ణయానికి కట్టుబడి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మిస్టర్‌ క్లీన్‌ ముద్ర ఉన్న నితీశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించాయి.

అటు ఎన్డీయే శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికైన వెంటనే నితీశ్‌ కుమార్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌ను కలిశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనని కోరారు. ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. గవర్నర్‌ ఆదేశం మేరకు ఇవాళ సాయంత్రం 4:30 నిమిషాలకు  బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్ రాజ్‌ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇక బీహార్‌ ఉపముఖ్యమంత్రి పదవి ఈసారి ఇద్దరిని వరించే అవకాశాలున్నాయి. సీమాంచల్ ప్రాంతంలో బలమైన నేతగా పేరున్న కతిహార్ ఎమ్మెల్యే తారి కిషోర్ ప్రసాద్‌ ను బీజేపీ శాసనసభపక్ష నేతగా ఎన్నుకుంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన సుశీల్‌ కుమార్‌ మోదీ.. తారి కిషోర్ ప్రసాద్‌ ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. తారి కిషోర్ ప్రసాద్‌ తోపాటు మరో నేతను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. బీజేపీఎల్పీ ఉపనేతగా బెత్తాహ్ ఎమ్మెల్యే రేణుదేవిని ఎన్నుకోవడంతో ఆమెకు కూడా డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని వార్తలోస్తున్నాయి. సీఎంతోపాటే వీళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మరోవైపు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించిన సుశీల్‌ కుమార్ మోదీకి కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...