19.4 C
Hyderabad
Monday, November 30, 2020

బీహార్‌లో కొనసాగుతున్న చివరిదశ పోలింగ్

బీహార్ అసెంబ్లీ చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. ఈ దశలో 78 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా…మొత్తం 1204 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాలతో పాటూ వాల్మికీ నగర్ పార్లమెంట్ స్థానానికి కూడా పోలింగ్ జరుగుతోంది. అక్కడ సిట్టింగ్ ఎంపీ మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. కరోనా నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లలో భౌతిక దూరం పాటించడం, మాస్క్‌, శానిటైజర్లు ఉపయోగించడాన్ని తప్పనిసరి చేశారు. ఇప్పటికే రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ పోలింగ్ పూర్తవ్వగా…ఈ నెల 10 న కౌంటింగ్ జరుగనుంది. అదే రోజు ఫలితం తేలనుంది. గతంలో కలిసి పోటీ చేసిన ఆర్జేడీ, జేడీయూ ఈ సారి హోరా హోరీగా తలపడుతున్నాయి. వీటికి తోడు ఎన్డీయే నుంచి వేరుపడ్డ ఎల్జేపీ…ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇవే నా చివరి ఎన్నికలంటూ బీహార్ సీఎం నితీష్‌ కుమార్ సెంటిమెంట్ అస్త్రం వదిలారు. అటు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆర్జేడీ సీఎం అభ్యర్ధి తేజస్వీ యాదవ్ కోరుతున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.