బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో పలు జిల్లాలు నీట మునిగాయి. వరద ఉదృతి పెరగడంతో కిషన్‌గంజ్‌లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభానికి ముందే కూలిపోయింది. గోవాబారీ గ్రామంలో కిన్కాయీ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన కూలడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.