18 C
Hyderabad
Friday, November 27, 2020

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం

తీవ్ర ఉత్కంఠరేపిన బిహార్‌ పూర్తి ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్‌. ఈ ఫలితాల్లో ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. దీంతో మరోసారి బిహార్‌ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోరులో ఎన్డీయే కూటమి 125 స్థానాలు కైవసం చేసుకుని విజయదుందుబి మోగించింది. మొత్తం 243 స్థానాలకుగానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 మేజిక్‌ ఫిగర్‌ ను దాటేసి 125 స్థానాల్లో విజయం సాధించింది. ఇక తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహా కూటమి 110 స్థానాలు గెలిచి గట్టిపోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధించగా.. ఎల్జేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తారుమారు చేస్తూ బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే ప్రజలు పట్టం కట్టారు.

కరోనా నేపథ్యంలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాలను పెంచటంలో ఆ ప్రభావం ఓట్ల లెక్కింపుపై పడింది. ఈవీఎం యంత్రాలు ఎక్కువగా ఉండటంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఎన్నికల్లో గెలిచిన ప్రముఖుల్లో ఆర్జేడీ నేతలు తేజస్వీ, తేజ్‌ప్రతాప్‌ సోదరులు, మాజీ సీఎం జీతన్‌రాంమాంఝీ తదితరులు ఉన్నారు.  

ఎన్డీఏ గెలుపుతో జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ ఆరోసారి బీహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2005 నుంచి సీఎంగా కొనసాగుతున్న ఆయన వివిధ కారణాలతో పలుసార్లు రాజీనామా చేసి మళ్లీ సీఎంగా ఎన్నికయ్యారు. అలా బీహార్‌ ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఐదుసార్లు ప్రమాణం చేశారు. కాగా, 2015 ఎన్నికల్లో 80 సీట్లు గెలిచి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ, తాజా ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినప్పటికీ రాష్ట్రంలో పెద్దపార్టీగానే నిలిచింది. 

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...