దేశ ప్రజలకు ఆషాడ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ప్రపంచానికి ధర్మాన్ని భోధించిన బుద్దుడు పుట్టిన నేల భారత్ అన్నారు రామ్ నాథ్. ఇక్కడి నుంచే ప్రపంచమంతా శాంతి, మానవత్వాలను బుద్దుడు బోధించారన్నారు. ఆయన బోధనలను, సూత్రాలను ప్రతి ఒక్కరు పాటించాలని పిలుపునిచ్చారు రాష్ట్రపతి.