18 C
Hyderabad
Friday, November 27, 2020

బెంగళూరు పై ముంబై అద్భుత విజయం

ఐపీఎల్‌లో ముంబై జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆదరగొట్టింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకున్న తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ చెలరేగటంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ముంబై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.    

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన  బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవదత్‌ పడిక్కల్‌, జోష్‌ పిలిప్‌లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. పవర్‌ ఫ్లే ముగిసే సమయానికి బెంగళూరు 6 ఓవర్లలో 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 71 పరుగుల దగ్గర రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో జోష్ పిలిప్ స్టంట్‌ ఔట్‌ అయ్యాడు. ఇక కెప్టెన్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. దీంతో ఆర్‌సీబీ టీం 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో వరుస విరామాల్లో ఆర్సీబీ వికెట్లు కోల్పోయింది. 45 బంతుల్లో 74 పరుగులు సాధించిన దేవదత్ పడిక్కల్ తో పాటు శివమ్ దూబెను ఒకే ఓవర్ లో ఔట్ చేసి బుమ్రా బెంగళూరుకి షాకిచ్చాడు. ఆఖర్లో వాషింగ్టన్‌ సుందర్‌ 10,  గురుకిరత్‌ 14 పరుగులు చేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా.. బౌల్ట్‌, పొలార్డ్‌, రాహుల్‌ చాహర్‌ తలొ వికెట్‌ తీశారు..                         

165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు  ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. జట్టు స్కోరు 37 పరుగుల దగ్గర  సిరాజ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ డికాక్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత  కొద్దిసేపటికే ఇషాన్ కిషన్‌, సౌరభ్‌ తివారీ వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్‌ పాండ్యా.. సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. అయితే కృనాల్‌ను చాహల్‌ ఔట్‌చేసి ముంబైని దెబ్బతీశాడు. వికెట్లు పడుతున్నా మరోవైపు సూర్యకుమార్‌ తన పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో 29 బంతుల్లోనే ఆర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 43 బంతుల్లో 79 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ .. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ముంబైకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. 

ముంబై ఇండియన్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకున్న తొలి టీంగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...