కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతుల ఆందోళనకు మద్దతుగా బంద్ లో 24 పార్టీలు పాల్గొన్నయి. దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లో భారత్ బంద్ విజయవంతంగా జరిగింది. రైతుల ఆందోళనకు సోనియాగాంధీ మద్దతు ప్రకటించిర్రు. ప్రయాగ్ రాజ్ లో ఎస్పీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నరు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నరు. ఒడిశాలో రైతు సంఘాలు రోడ్డు మీద నిరసనకు దిగాయి. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రవాణా స్థంభించిపోయింది. భువనేశ్వర్ లో రైతులు రైళ్లను అడ్డుకున్నరు.
పశ్చిమ బెంగాల్ లో రైతులు ఆందోళనకు దిగారు. కోల్ కతాలో కిసాన్ మజ్ధూర్ యూనియన్లు రైళ్లను అడ్డుకున్నరు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నరు. మహారాష్ర్ట బుల్దానాలో రైతు సంఘాలు నవజీవన్ ఎక్స్ ప్రెస్ ను అడ్డుకున్నరు. అస్సాంలో రైతులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గౌహతిలో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్ దృష్ట్యా బిహార్ లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు జైపూర్ లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిర్రు. ఢిల్లీలో ఇంకా రైతుల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నయి. పోలీసులు ఢిల్లీ సరిహద్దులను మూసేసి రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నరు. హర్యానాలో రైతు సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీలో రైతులకు మద్దతుగా లెఫ్ట్ పార్టీలు ర్యాలీలు తీశాయి. పంజాబ్ లో కాంగ్రెస్, శిరోమణి అకాళీదల్, ఆప్ పార్టీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. బంద్ కు మద్దతుగా వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛంధంగా మూసివేశారు. యూపీలో లఖింపూర్, ఫిలిబిత్, సంబల్, బాఘ్ పాట్ , బర్భంకిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. థానే, ముంబై, జల్నా, నాందేడ్, పూణెలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది.