భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 70లక్షల మార్కును దాటాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 73,272 కేసులు బయటపడటంతో దేశంలో నిర్ధారణ అయిన మొత్తం కేసులు 69 లక్షల 79వేల424 దాటినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.నిన్నటికి నిన్న 926 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1లక్షా 07వేల 416కు చేరుకున్నట్టు వెల్లడించింది. ఇక యాక్టివ్ కేసులు 8లక్షల83వేల185కు చేరినట్టు పేర్కొంది.