మహారాష్ట్రను భారీ వర్షాు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంబై, పూణే, షోలాపూర్, సాంగ్లీ, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో 27 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. లోతట్టుప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచిపోవడంతో 20వేల మంది బాధితులును సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇక ముంబై నగరంలో భారీవర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు.