23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

మంత్రివర్గం,పీసీసీ పదవి నుంచి సచిన్ పైలట్ తొలగింపు

రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌ కు చేరింది. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ పై కాంగ్రెస్ హైకమాండ్ వేటు వేసింది. ఆయనను రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించింది. గోవింద్ దో త్రాను రాష్ట్ర పీసీసీ కొత్త చీఫ్‌గా ఎంపిక చేసింది. పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి వచ్చేందుకు నిరాకరించడంతో పాటు సీఎం అశోక్ గెహ్లాట్‌ను పదవి నుంచి తప్పించాల్సిందే అని పట్టుబడుతున్న సచిన్ పైలట్‌పై అధిష్టానం చర్యలు తీసుకుంది. అశోక్ గెహ్లాట్‌ వైపు ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు… సచిన్ పైలట్‌పై చర్యలు తీసుకోవాలని సీఎల్పీలో డిమాండ్‌ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్‌ అధిష్టానం

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...