మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్ లో ఇండోర్- అహ్మదాబాద్ జాతీయ రహదారిపై వ్యాన్, ట్యాంకర్ ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలిపారు. ప్రమాద సమయంలో వ్యాన్ లో 40మంది కూలీలు ఉన్నట్టు తెలిపిన పోలీసులు.. ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు