ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 3కోట్ల 28లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 9లక్షల 94వేలకు చేరింది. అయితే ప్రపంచదేశాలు మేల్కొనకపోతే .. మరణాల సంఖ్య 20లక్షలు దాటే అవకాశం ఉందని హెచ్చరించింది వరల్డ్ హెల్త్ ఆర్గరైజేషన్. ఇప్పటికే మరణాల సంఖ్య పది లక్షలకు చేరువలో ఉందన్న డబ్ల్యూహెచ్ఓ ..వైరస్ వల్ల మరో పది లక్షల మంది బలికాక ముందే చర్యలు తీసుకోవాలని సూచించింది.