29.8 C
Hyderabad
Tuesday, January 26, 2021

మరో రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్ పేట్‌, సోమాజీగూడ, సనత్ నగర్‌, నాంపల్లి, బేగంబజార్, ఆఫ్జల్ గంజ్, కోఠి, బషీర్‌ బాగ్  , పాతబస్తీ,  సైదాబాద్, సంతోష్ నగర్ ,చంపా పేట్,  కంచెన్ బాగ్, చంద్రాయన్ గుట్ట ,చెత్రినాక, లాల్ దర్వాజా,  గౌలిపురా, ఫలక్ నుమా, శాలిబండ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అటు సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్ పల్లి, కూకట్ పల్లిలో వాన పడింది. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ లో పలుచోట్ల వర్షం కురిసింది.

మెదక్ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. మెదక్‌, రేగోడ్, అల్లాదుర్గంలో భారీ వర్షం కురిసింది. నర్సాపూర్, వాటపల్లి, రాయికోడ్ మండలాల్లో మోస్తరు వర్షం పడింది. ఇక కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, మానకొండూరు, చిగురుమామిడి, గన్నేరువరం, శంకరపట్నం, చొప్పదండి, రామడుగు తదితర మండలాల్లో వర్షం కురిసింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల వాన పడింది.

అటు నల్గగొండ జిల్లాను వర్షం ముంచెత్తింది. హాలియా, కనగల్, తిప్పర్తి, చిట్యాల, నార్కట్ పల్లి మండలాల్లో మోస్తరు వర్షo కురిసింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడగా కోదాడ, మునగాల, నడిగూడెం, అనంతగిరి, మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, వేములవాడను భారీ వర్షం ముంచెత్తింది.

ఖమ్మం జిల్లాలో పలుచోట్ల వాన పడింది. ఖమ్మం రూరల్ , కామేపల్లి , రఘునాథపాలెం మండలాలోతో పాటు వైరా నియోజకవర్గంలో మోస్తరు వర్షం కురిసింది. చింతకాని మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చిరు జల్లులు కురిశాయి. అటు వరంగల్ రూరల్ జిల్లా వర్థన్నపేట, పరకాల డివిజన్లలో మోస్తరు వర్షం పడగా.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, నెల్లికుదుర్, కేసముధ్రం, గూడూర్ మండలాల్లో మోస్తారు వర్షం పడింది. ములుగు జిల్లా మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల్లో వర్షం పడింది. జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్, చిల్పూర్ , జఫర్‌ గడ్ , రఘునాథపల్లి మండలాల్లో వర్షం కురిసింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

- Advertisement -

Latest news

Related news

బ్లూ రైస్‌తో బోలెడు లాభాలు

అన్నం తినడం వల్ల ఆకలి తీరడమే కాదు, అందంగా కూడా మారొచ్చన్న సంగతి తెలుసా.. అయితే అది మనం తినే రెగ్యలర్ వైట్ రైస్ కాదు. ప్రత్యేకంగా చేసే బ్లూ...

ఇద్దరు విలన్లతో బాలయ్య భారీ యాక్షన్.. విలన్స్ ఎవరంటే..

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో సినిమా అంటే మామూలుగా ఉండదు. అందులోనూ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా అని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది....

ఎర్రకోటకు చేరిన కిసాన్ పరేడ్

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో సాగుతున్న కిసాన్ గణతంత్ర పరేడ్ ఉద్రిక్తల నడుమ ఎర్రకోటకు చేరింది. పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్గించిన రైతులు ఎర్రకోటపైకి చేరుకున్నారు....

తిరుపతిలో కుప్పకూలిన ఫ్లైఓవర్

తిరుపతి తిరుమల బైపాస్ రోడ్ లో ఉన్న శ్రీనివాసన్ అతిథి భవనం ఎదురుగా ఉన్న నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కూప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ దిమ్మలు...