మహాత్మ గాంధీ 151వ జయంతి సందర్భంగా.. లంగర్ హౌజ్‌లోని బాపుఘాట్ దగ్గర మహాత్ముడికి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. వీరితో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీజీకి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రం కోసం మహాత్ముడి పోరాటం మరువలేనిదన్నారు సీఎం కేసీఆర్.. గాంధీజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు..