మహారాష్ట్రలోని పాల్ఘర్ పరిసర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు పాల్ఘర్లో భూమి కంపించగా రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రకంపనల తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.