మహారాష్ర్టను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుంభవృష్టితో దేశ ఆర్థిక రాజధాని తడిసిముద్దవుతోంది. అయితే ఇవాళ, రేపు ముంబైలో అతిభారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అవసరమైతే తప్పప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని బీఎంసీ సూచించింది.ఇటు థానే,పూణే, షోలాపూర్, ఉత్తర కొంకణ్ ప్రాంతంలో కుండపోత కురుస్తుండడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నింగాన్ కేట్కీలో వరదనీటిలో చిక్కుకున్న 40మందిని కాపాడారు. ఇందాపూర్ లో మరో ఇద్దరు వరదనీటిలో కొట్టుకుపోతుండగా రక్షించారు..