బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. నివర్ కష్టాలు వీడకముందే..బురేవి తుపాను ముంచుకొస్తుండడంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలను అప్రమత్తం చేసింది వాతావరణశాఖ. బురేవి ప్రభావంతో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.