విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముంబైలో బ్లాకౌట్ ఏర్పడింది. గ్రిడ్ ఫెయిల్యూర్ వల్ల నగరంలో విద్యుత్ సమస్య తలెత్తినట్టు తెలిపింది బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఎంఐడీసీ, పాల్గర్, దహనూ లైన్లలో సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని వెల్లడించింది. పలు రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రిక్ సరఫరా లేక రైళ్లు ఆగిపోయాయి. ముంబై, థానే నగరాల్లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో వాటిల్లిన అంతరాయంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అయితే విద్యుత్ సరఫరాలో అంతరాయానికి తాము చింతిస్తున్నామన్న అధికారులు.. పునరుద్దరణ చర్యలు చేపట్టారు.