మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రినిటారియా నుంచి ఫ్రంటెరా కోమాలపా వైపు వేగంగా వెళ్తున్న ఓ బస్సు గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో 23మంది మృతి చెందగా..మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు.. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.