24.2 C
Hyderabad
Friday, January 22, 2021

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీక్టొటింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ చాంద్రాయణగుట్ట కు చెందిన ఇద్దరు చిన్నారులు ఫజన్ మహబూబ్ ఖాన్(7), ఉక్ష అదిల్ ఖాన్( 13) స్పాట్ లో చనిపోగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తెల్లవారు జామున 2గంటల సమయంలో జరిగింది. హైదరాబాద్ నుండి షాద్ నగర్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో 12 మంది ప్రయాణికులు కారులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Latest news

Related news

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

మగవాళ్లను భయపెడుతున్న కోవిడ్ కొత్త సర్వే

వ్యాక్సిన్ వచ్చి.. మెల్లగా కరోనా తగ్గిపోతుందన్న సందర్భంలో.. ఓ కొత్త న్యూస్ భయపెడుతుంది. వైరస్ సోకిన పురుషుల్లో అతికొద్ది మందికి కామన్ గా ఒక లక్షణం కనిపిస్తోంది.