19.8 C
Hyderabad
Friday, December 4, 2020

రఫేల్ రాకతో భారత వాయుసేన మరింత పటిష్టమైంది: రాజ్‌ నాథ్‌ సింగ్

సరిహద్దుల్లో భూభాగాల ఆక్రమణలకు పాల్పడే దేశాలకు రఫేల్‌ గట్టి సందేశాన్ని ఇవ్వనున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. భారత్‌, చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నడుమ…రఫేల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలోకి ప్రవేశించాయి. దేశానికి చేరుకున్న  యుద్ధ విమానాలను అధికారికంగా రక్షణ శాఖ వైమానికి దళానికి అప్పగించింది.

నాలుగేళ్ల కిందట కొనుగోలు చేసిన ఐదు రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌ కు చేరుకోగా, వాటిని అధికారికంగా వాయుసేనకు రక్షణశాఖ అప్పగించింది. రఫేల్ యుద్ధవిమానాల చేరికతో భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ మంత్రి ఫ్లొరెన్స్‌ పార్లె నేతృత్వంలో మొదటి బ్యాచ్‌ కు చెందిన ఐదు రఫెల్ యుద్ధ విమానాలను అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశ పెట్టారు. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో నిర్వహించిన  ఈ కార్యక్రమంలో  సీడీఎస్ బిపిన్ రావత్, వాయుసేనాధిపతి బదౌరియా, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, వైమానిక దళం నిర్వహించిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. 

నాలుగు సంవత్సరాల క్రితం భారత్‌, ఫ్రాన్స్‌ దేశాలకు మధ్య 36 రఫెల్ విమనాల కోసం ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం విలువ 59,000 వేలకోట్ల రూపాయలు. ఆ విమానాల తయారీ బాధ్యతను ఆ దేశానికి చెందిన ఏరోస్పేస్‌ సంస్థ దసో ఏవియేషన్‌ తీసుకుంది. దానిలో భాగంగా మొదటి బ్యాచ్‌కు చెందిన ఐదు విమానాలు జులై 29న పంజాబ్‌లోని అంబాలాకు చేరుకున్నాయి.వాయుసేనకు రఫేల్ యుద్ధ విమానాలు అప్పగించేందుకు అంబాలా ఎయిర్​ బేస్​ లో రక్షణ శాఖ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.

ఒక దేశం భూభాగాన్ని మరో దేశం ఆక్రమించాలనే దేశాలకు రఫేల్ యుద్ధ విమానాలు గట్టి సమాధానం ఇవ్వనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ అన్నారు. రఫేల్ దేశంలోకి ఎంట్రీతో సరిహద్దులో భద్రత మరింత బలపడనున్నట్లు రాజ్ నాథ్ స్పష్టంచేశారు. భారత వాయుసేనలోకి రఫేల్ యుద్ధ విమానాల ప్రవేశాన్ని రక్షణ శాఖ మంత్రి స్వాగతించారు.  రఫేల్‌ను ఐఎఎఫ్ లోకి ప్రవేశపెట్టడంతో ఫ్రాన్స్, భారత్‌ ల మధ్య  సంబంధాలు మరింత బలపడతాయన్నారు. ప్రధాని దృఢ సంకల్పంవల్లనే రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌ చేరాయని రాజ్ నాథ్‌ సింగ్ చెప్పారు.

అంబాలా ఎయిర్ బేస్‌ లో రఫేల్​తో పాటు తేజస్ జెట్లు వాయు విన్యాసాలు ప్రదర్శించాయి. రఫేల్ జెట్లను వైమానిక దళంలోకి పంపే ముందు.. వాటర్ కెనాన్ సెల్యూట్ కార్యక్రమం ఆకట్టుకుంది.భారత వాయుసేనలో 17వ స్కాడ్రన్‌ గా రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేకంగా నిలువనున్నాయి. ఐతే భారత్‌-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాల ప్రవేశంపై ప్రాధాన్యత  నెలకొంది.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...