రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. కోటాలోని చంబల్ నదిలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు. మరో 9మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలను ముమ్మరం చేసిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది 15మందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో పడవలో 30మంది ఉన్నారంటున్న అధికారులు.. బాధితులంతా కమలేశ్వర మహాదేవ్ దేవాలయానికి ఈ ఘటన జరిగినట్టు తెలిపారు.