మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దేవెగౌడ చేత రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. గత లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడ ఓటమి చెందడంతో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కరోనా నేపథ్యంలో ప్రమాణస్వీకారం చేయడం ఆలస్యమయ్యింది. ఇవాళ రాజ్యసభకు వచ్చిన వ్యవసాయ బిల్లులపై దేవెగౌడ మాట్లాడనున్నారు.