విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభను బహిష్కరించింది టీఆర్ఎస్. సభ్యులపై వెంటనే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు. దీంతో పాటూ రైతులకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ బిల్లులపై నిరసనగా సమావేశాలను బాయ్‌కాట్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీలు చేస్తున్న నిరసనలకు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు.