ఢిల్లీలో జరిగిన మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకల్లో పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. జాతిపిత సమాధీ రాజ్‌ఘాట్ లో పూలమాల వేసి నివాళి అర్పించారు ప్రధాని మోడీ. అనంతరం దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని విజయ్ ఘాట్ లో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు ..దివంగత నేతలకు శ్రద్ధాంజలి ఘటించారు.