19.5 C
Hyderabad
Friday, November 27, 2020

రాబోయే 2 రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మధ్య బంగాళఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరిత ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించారు. బుధవారానికి మరింత బల పడి తీవ్రంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ డైరెక్టర్ నాగారత్నం తెలిపారు. మూడ్రోజుల్లో ఇది వాయవ్యదిశగా ప్రయాణించొచ్చని తెలిపారు.   

అల్పపీడనా నికి అనుబంధంగా 1.5 కిలోమీటర్ల నుంచి 7.6  కిలోమీటర్ల ఎత్తువరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. ఈ రెండింటి ప్రభావంతో రెండ్రోజులు జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. వాతా వరణ హెచ్చరికలపై విపత్తు నిర్వహణశాఖ, ఇతర ప్రభుత్వశాఖలను అప్రమత్తం చేసినట్టు నాగరత్న తెలిపారు. గ్రేటర్ లో ప్రధానంగా  సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో అత్యధికంగా వనపర్తి జిల్లా ఘన్‌ప్పూ లో 6.2 సెం.మీ. వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 5.5 సెం.మీ., మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో 5 సెం.మీ., రంగారెడ్డి జిల్లా మంచాలలో 4.6 సెం.మీ., నారాయణపేట జిల్లా మాగనూర్లో 4.2 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

- Advertisement -

Latest news

Related news

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....