23.2 C
Hyderabad
Tuesday, October 20, 2020

రామ్‌విలాస్ పాశ్వాన్ పార్ధివ‌దేహానికి ప్ర‌ధాని మోదీ, రాష్ర్టపతి‌ నివాళి

కేంద్ర మంత్రి రామ్‌ విలాస్ పాశ్వాన్‌ మృతదేహానికి నివాళ్లు అర్పించారు రాష్ర్టపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ. పాశ్వాన్‌ ఇంటికి వెళ్లి.. ఆయన పార్దీవ‌దేహంపై పుష్ప‌గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.  ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ ను ఓదార్చారు. బీహార్‌ ప్రజలకు పాశ్వాన్‌ చేసిన సేవలను కొనియాడారు.లోక్‌ జ‌న‌శ‌క్తి పార్టీని  స్థాపించి ద‌ళిత నేత‌గా రామ్‌విలాస్ ఎన‌లేని కీర్తిని గ‌డించారన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు పాశ్వాన్‌ బౌతిక కాయానికి నివాళ్లు అర్పించారు. ఇటీవ‌లే గుండె ఆప‌రేష‌న్ చేయించుకున్న ఆయన..చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. సాయంత్రం ఢిల్లీ నుంచి ఆయన పార్థివ దేహాన్ని పాట్నాకు తరలించనున్నారు.రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Latest news

Related news

నాలుగో రోజు వరద ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. రాజేంద్రనగర్ లో పర్యటించిన మంత్రి వరదల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఐదు లక్షల రూపాలయ ఎక్స్ గ్రేషియా...

ఓఆర్ఆర్ పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్ లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ఆర్ పై 10 ట్రామా కేంద్రాలు, 10 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లను మంత్రి కేటీఆర్ ప్రాంరంభించారు. దీంతో ఓఆర్ఆర్ పై  పూర్తి స్ధాయి...

భారత్‌లో 74 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. అక్టోబరు తొలి 15 రోజుల్లో కరోనా కొత్త కేసులలో 18%, మరణాల్లో 19% తగ్గుదల కనిపించింది. నిన్నటికి నిన్న 62వేల  212కొత్త...

ఏడు నెలల తరువాత తెరుచుకున్న శబరిమల

శబరిమల ఆలయం తెరుచుకుంది. ఏడునెలల తరువాత ఇవాళ్లి నుంచి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు.  అయ్యప్ప యాత్రకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. ఆలయంలోకి ప్రవేశించాలనుకునే...