ఛత్తీస్ గఢ్ లో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్ ఘడ్ లో వేగంగా వచ్చిన లారీ ఓ వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రాయ్ ఘడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవరు కోసం గాలిస్తున్నారు.