రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో యూరియా కొరతపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. లాక్డౌన్, కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలో అంతరాయం కలిగిందన్నరు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో యూరియా కొరత ఉంటే.. వెంటనే సంప్రదించాలన్నరు. ఆరు గంటల్లోపు ఆయా కేంద్రాలకు యూరియాను సరఫరా చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. యూరియా కొరత రాకుండా పలు చర్యలు తీసుకున్నామన్నరు.