21.2 C
Hyderabad
Monday, January 18, 2021

ఐటి, పరిశ్రమల శాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

తెలంగాణ ప్రభుత్వ ఆలోచనల మేరకు ఐటీ పరిశ్రమలను నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించే కార్యక్రమాలపైన సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ నెల 7న ఖమ్మంలో ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పలు ఐటీ కంపెనీలు వరంగల్ నగరంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అందుకు అవసరమైన అవసరమైన మౌలిక వసతులను, ఇతర సదుపాయాలకు సంబంధించి టిఎస్ఐఐసీ చేపడుతున్న కార్యాచరణ గురించి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు విస్తరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చిన గ్రోత్ ఇన్ డిస్ పర్షన్ (గ్రిడ్) పాలసీకి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఐటీ పార్కులను నిర్మాణం చేసేందుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ని మంత్రి టెలిఫోన్ లో మంత్రి కోరారు. కొంపల్లిల్లో ఒక ఐటీ పార్క్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని టిఎస్ఐఐసి ఎండీ నరసింహ రెడ్డికి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్ నగర్ దివిటిపల్లి ప్రాంతంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలియజేశారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో అగ్రస్థానాన్ని సాధించేందుకు పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తుందని పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్ మంత్రికి వివరించారు. సాంకేతిక అంశాల వల్ల గతేడాది తక్కువ ర్యాంకు వచ్చిన నేపథ్యంలో.. ఈసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ కు మంత్రి కేటీఆర్ సూచించారు.  ఈ మేరకు ఇతర శాఖల సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...