కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కామారెడ్డి టెక్రియాల్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో కలిసి భారత్ బంద్ లో పాల్గొన్నారు.

బంద్ లో భారీగా పాల్గొన్న కార్యకర్తలు, రైతులకు వ్యవసాయ చట్టాల వల్ల వ్యవసాయ రంగానికి జరిగే నష్టాన్ని ఎమ్మెల్సీ కవిత వివరించి చెప్పారు. రైతులకు సంఘీభావం తెలిపిన ఆమె.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేయ చూస్తున్న వ్యవసాయ చట్టాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. నల్ల బెలూన్లు గాల్లోకి వదిలారు.