29.6 C
Hyderabad
Wednesday, January 27, 2021

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. మల్లన్న దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మిలకు  దేవస్థాన కార్యనిర్వహణాధికారి,  అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో  స్వాగతం పలికారు.

స్వామిని దర్శించుకొని అభిషేక పూజలు నిర్వహించిన అనంతరం.. మంత్రి దంపతులు మల్లన్నకు 50 గ్రాముల  బంగారు మీసాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు  వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు,  స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆరేండ్లలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం బాగా అభివృద్ధి చెందిందన్నారు మంత్రి అల్లలో ఇంద్రకరణ్ రెడ్డి. భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం 130 ఎకరాల భూమిని ఆలయానికి కేటాయించిందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...

గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను...

రూ.4500 కోట్లు ఆర్జించిన ఓటీటీలు

దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు గతేడాది రూ.4500 కోట్లు ఆర్జించాయని ఈవై ఫిక్కి ఇండియన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఓటీటీల వ్యాపార విలువ...

చోప్రా లైఫ్ జర్నీ.. షేర్ చేసిన అమితాబ్

పీకే, త్రీ ఇడియట్స్, సంజు, లగేరహో మున్నాభాయ్, మున్నా భాయ్ ఎంబీబీఎస్, మిషన్ కశ్మీర్, ఖామోష్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా...