19.3 C
Hyderabad
Thursday, January 21, 2021

గేటెడ్ కమ్యూనిటీలకు ధీటుగా రెండు పడకల ఇండ్లు : హరీశ్ రావు

పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకానికి రూపకల్పన చేశారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన పనులు మొదలుపెట్టామని తెలిపారు. జిల్లాకు ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

ఒకప్పుడు ప్రభుత్వం ఇండ్లు నిర్మించిన ప్రాంతాలు మురికి వాడలుగా ఉండేవని.. తెరాస నిర్మించిన ప్రభుత్వ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ కాలనీలు గేటెడ్‌ కమ్యూనిటీలకు ధీటుగా ఉన్నాయని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంత ఇల్లును ఎంత శ్రద్ధగా కట్టుకుంటామో.. అంతే చిత్తశుద్ధితో సకల సౌకర్యాలతో పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇచ్చామని సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల ప్రారంభోత్సవంలో తెలంగాణ ఆడబిడ్డలు ఆనందబాష్పాలు కారుస్తుంటే కడుపు నిండినంత ఆనందం కలిగిందన్నారు మంత్రి హరీశ్ రావు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...