26 C
Hyderabad
Wednesday, January 27, 2021

తొలి ఫలితం మెహిదీపట్నందే!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. అందరిలో ఏ స్థానంలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటికీ, ఫలితాల్లో స్పష్టతకోసం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆగాల్సిందే. అయితే గ్రేటర్‌లోని 150 డివిజన్లలో అన్నిటికంటే ముందు మెహదీపట్నం డివిజన్‌ ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నదంటున్నారు అధికారులు. ఈ డివిజన్‌లో అత్యల్పంగా 11,818 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో తొలి ఫలితం మెహిదీపట్నం డివిజన్‌లోనే వచ్చే అవకాశం ఉంది. 

గ్రేటర్‌ ఎన్నికల్లో మొత్తం 1122 మంది పోటీచేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని డివిజన్ల అభ్యర్థుల గెలుపోటములు తేలనున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు అధికారులు తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 18 ఏండ్ల తర్వాత బ్యాలెట్‌ పత్రాలను ఉపయోగించారు. దీంతో ఫలితాలు వెల్లడించడానికి కొంచెం ఆలస్యం కావచ్చు.

ఉదయం 8 గంటలకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఈసారి 1926 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు. తొలి పది నిమిషాల్లో పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కింపు పూర్తి కానుంది. ఆ తర్వాత ప్రాథమిక లెక్కింపు ప్రారంభమవుతుంది.

- Advertisement -

Latest news

Related news

వంటిమామిడిలో కోల్డ్ స్టోరేజ్ కడుతాం : సీఎం కేసీఆర్

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌లోని రైతులతో మాట్లాడిన సీఎం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంటి మామిడి కూరగాయల మార్కెట్లో...

మదనపల్లె జంటహత్య కేసు నిందితులకు.. 14రోజుల రిమాండ్

మదనపల్లె జంటహత్యల కేసులో నిందితులైన మృతురాళ్ల తల్లితండ్రులకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడులను పోలీసులు మంగళవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. కోర్టు నిందితులకు...

ఆకస్మికంగా మార్కెట్‌యార్డుకు సీఎం కేసీఆర్‌

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం అక్కడున్నరైతులతో మాట్లాడారు. పంటల సాగు, ధరలను  అడిగి...

ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి.. మంత్రి వేముల

సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, అకుంఠిత దీక్షతో ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్నినిర్మించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన...