గ్రేటర్ ఎన్నికల్లో.. ఓటు వేసేందుకు కొంతమంది నగర పౌరులు విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు. టీఆర్ఎస్ ఒమన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మస్కట్ నుంచి కుటుంబ సమేతంగా హైదరాబాద్ వచ్చి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని.. విధిగా ప్రతి ఒక్కరు ఆ హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ ఎంతో ఎదిగి ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. కొన్ని జాతీయ పార్టీల నాయకులు ప్రచారంలో పాల్గొని ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. వారి ప్రకటనలతోనే.. నగర ప్రజలు.. ఓటు వేయడానికి బయటకు రావడం లేదని.. అందుకే ఓటింగ్ శాతం తగ్గిందన్నారు.