
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇవాళ పొద్దున చనిపోయిన్రు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో దవాఖానకు తీసుకుపోయిన్రు. ట్రీట్ మెంట్ జరుగుతున్నప్పుడు గుండెపోటు రావడంతో నోముల చనిపోయిన్రు. కొన్ని రోజుల సంది ఊపరితిత్తుల వ్యాధితో బాధపడుతన్న నోములకు నెల కిందట కరోనా వచ్చింది. చికిత్స తరువాత నెగెటివ్ వచ్చినప్పటికీ కోలుకోలేదు.
ఎంపీపీగా రాజకీయ జీవితం ప్రారంభించిన నోముల నర్సింహయ్య 1956లో జన్మించిన్రు. సీపీఎం తరఫున రెండుసార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిచిన్రు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరి నాగార్జునసాగర్ నుంచి ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై విజయం గెలిచిన్రు. నోముల మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సంతాపం తెలిపిన్రు.