23.5 C
Hyderabad
Sunday, January 24, 2021

నోముల అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.

ఉద‌యం 11:30 గంట‌ల‌కు పాలెం చేరుకున్న సీఎం.. నోముల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నోముల కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, జ‌గ‌దీశ్ రెడ్డి, మండ‌లి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోముల నర్సింహయ్య భౌతిక కాయానికి నివాళుల‌ర్పించారు.  నోముల స్వగ్రామైన నల్లగొండ జిల్లా.. నకిరేకల్ మండలం పాలెంలో జరిగిన అంత్యక్రియల్లో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని.. నివాళులు అర్పించారు.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...