గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల తెరాస, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి.. పలు పార్టీల కార్యకర్తలు, నాయకులు కాలనీల్లో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని.. ఇరు పార్టీల నేతలు పరస్ఫరం ఆరోపణలు చేసుకున్నాయి.

– యాకుత్ పురాలో ఆటోల్లో వచ్చి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన మహిళలను ఎంబీటీ నాయకులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.
– సంగారెడ్డి జిల్లాలోని భారతి నగర్ డివిజన్ లో టీఆర్ఎస్, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
– సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో అధికారులు ఓటరు స్లిప్పులు పంపిణీ చేయలేదని ఓటర్లు పోలింగ్ సిబ్బందిపై మండిపడ్డారు.
– పోలింగ్ బూత్ దొరకక.. చాలామంది ఓటర్లు ఓటు వేయకుండానే ఇంటిబాట పట్టారు.
– సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంటివద్దనే ఉండి.. మై జీహెచ్ఎంసీ యాప్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
– ఘన్సీబజార్ అభ్యర్థి రేణుసోని ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లపై.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ స్లిప్పులు లేకపోతే ఓటు వేయొద్దని అభ్యంతరం తెలిపారు.
– బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పోలింగ్ స్టేషన్లు 43, 44, 45, 46, 47, 48, 49, వద్ద ఉద్రిక్తత నెలకొంది.
– భారతినగర్ డివిజన్లోని స్లమ్ ఏరియాలో తమ ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.