19.4 C
Hyderabad
Wednesday, January 20, 2021

బల్దియా కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ కేటాయించనున్నట్టు అధికారులు చెప్తున్నారు.

ఒక్క హాల్ లో 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం 8152 కౌంటింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. కౌంటింగ్ తీరును పరిశీలించేందుకు 31 మంది కౌంటింగ్ పరిశీలకులను ఈసీ నియమించింది.

కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కోసం.. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించారు. 1 రౌండ్ కి 14000 వేల ఓట్లు లెక్కింపు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కరోనా జాగ్రత్తలు..

కొవిడ్ -19 నివారణలో భాగంగా.. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంచారు. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి వచ్చేలా నిబంధనలు అమలు చేయనున్నారు. రావలసి ఉంటుంది. ప్రతి టేబుల్ దగ్గర కౌంటింగ్ ప్రక్రియ అంతా రికార్డు చేయనున్నారు.

బ్యాలెట్ ఓట్ల కంటే ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. గ్రేటర్ పరిధిలో 74 లక్షల 67వేల 256 ఓట్లు ఉండగా 34 లక్షల 50 వేల 331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 లక్షల 60,040 మంది పురుషులు, 15 లక్షల 90, 219 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఇంగ్లాండ్‌తో టెస్టులకు ఇండియా టీం ఇదే..

ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా,...

డిటిజల్ ‘వ‌కీల్‌సాబ్’ పోస్టర్ అదిరింది

టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌కీల్‌సాబ్ సినిమాతో త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవల విడుద‌లైన టీజ‌ర్ కు అభిమానులు ఫిదా అయ్యారు. అందులో పవన్ డైలాగ్ లకు...

శశికళ పార్టీలోనే లేరు.. పళనిస్వామి

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాల్లో అనుహ్య మార్పులు జరగుతున్నాయి. సీఎం పళనిస్వామి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు పెట్టుకునే...

ధోనీ రికార్డు బ్రేక్ చేసిన పంత్

టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్ రిషభ్‌ పంత్‌ టెస్టు క్రికెట్‌లో మహేంద్రసింగ్‌ ధోనీకి చెందిన ఓ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో వికెట్‌ కీపర్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో...