దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ లో భాగంగా.. రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి.. కార్పోరేట్ శక్తులకు అప్పజెప్పేందుకే మోడీ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైక్ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఫరీద్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బంద్ కు వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి.