25.4 C
Hyderabad
Sunday, January 17, 2021

భారత్ బంద్ కు మద్దతు తెలుపుదాం : మంత్రి కేటీఆర్

భారత్‌బంద్‌కు మద్దతుగా నిర్వహించే రాస్తారోకో, ధర్నాల్లో అన్నిస్థాయిల్లోని పార్టీక్యాడర్‌ పాల్గొని.. రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ వెన్నుచూపని రైతన్న పోరాట పటిమకు ఆయన సలాం చేశారు. టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు హైవేలపై జరిగే ధర్నా, రాస్తారోకోల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

వర్తక, వ్యాపారవర్గాలను సంప్రదించి బంద్‌కు సహకరించేలా కోరాలని తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులకు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల వరకు వర్తక, వ్యాపార, వాణిజ్యవర్గాలు తమ కార్యకలాపాలను బంద్‌చేసి రైతులకు సంఘీభావం తెలుపాలని, ఆర్టీసీ కూడా మధ్యాహ్నం తరువాతే బస్సులను నడపాలని కోరారు. కేంద్రం తెచ్చిన న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెల‌పాల‌ని పిలుపునిచ్చారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...