జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కూకట్పల్లి ఫోరమ్‌మాల్ దగ్గర మంత్రి పువ్వాడ అజయ్ కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేసి.. గాయపరిచారు. ఈ దాడిలో ఓ తెరాస కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు.

మంత్రి కాన్వాయ్‌ను వెంబడించి మరీ.. కారు అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని భాజపా కార్యకర్తలను చెదరగొట్టారు. మంత్రికి రక్షణ కల్పించి సురక్షితంగా పంపించారు.