గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. మధ్యాహ్నం వరకు.. కేవలం.. 25.34 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. నగర ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడానికి కారణాలేంటో.. అటు అధికారులు.. ఇటు రాజకీజ నాయకులకు అర్థం కాక.. తలలు పట్టుకుంటున్నారు.

కొన్ని డివిజన్లలో.. పోలింగ్ మధ్యాహ్నం దాటినా.. రెండంకెలు కూడా దాటకపోవడం గమనార్హం. సరూర్ నగర్ లో 27శాతం, ఆర్కే పురంలో 19.96 శాతం, కొత్తపేటలో 26.66 శాతం, చైతన్యపురిలో 30.37 శాతం, గడ్డి అన్నారంలో 30.40 శాతం, నాగోల్ లో 35.24 శాతం, మన్సూరాబాద్ లో 34.06 శాతం, హయత్ నగర్ లో 35.62 శాతం, బీఎన్ రెడ్డి నగర్ లో 34.23 శాతం, వనస్థలిపురంలో 36.64 శాతం, హస్తినాపురంలో 38.60 శాతం, చంపాపేటలో 38.09 శాతం, లింగోజిగూడలో 37.15 శాతం పోలింగ్ నమోదైనట్టు.. ఈసీ నివేదిక విడుదల చేసింది.