గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు పదవీ బాధ్యతలు చేపట్టడానికి రెండు నెలలు ఆగాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు అధికారులు ధృవీకరణ పత్రాలు అందించారు.
ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ఇంకా రెండు నెలలు మిగిలి ఉండటంతో కొత్తగా ఎన్నికైన వారికి కార్పోరేటర్ హోదా రావాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే. ప్రస్తుత పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం.. తాజాగా గెలిచిన వారికి పదవీ బాధ్యతలు అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నది. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ చట్టంలో సవరణ చేయడం వల్ల గడువుకు ముందే పాత పాలక వర్గాన్ని రద్దు చేసి.. ప్రభుత్వ కొత్త పాలకవర్గం కొలువు దీరేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.