జీహెచ్ఎంసీ పరిధిలో గత రెండు రోజులుగా వరద బాధితులకు వరద సాయం అందుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల వల్ల ఆగిపోయిన వరద సాయం మంగళవారం నుంచి తిరిగి ప్రారంభమైంది. బుధవారం నాటికి 17వేల 333 మందికి వరద సహాయంగా రూ. 17.33 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలుపారు.
డిసెంబర్ 8 మంగళవారం నాడు ప్రారంభమైన వరద బాధితులకు ఆర్థిక సహాయం.. తొలిరోజు 7,939 మందికి అందింది. రెండోరోజు 9394 మంది లబ్దిదారులకు అధికారులు వరద సాయం అందించారు. తొలిరోజు రూ.7.90 కోట్లు, రెండోరోజు 9.39 కోట్ల రూపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు వెల్లడించారు. నగరంలో వరద బాధితులకు ఆర్థిక సహాయాన్ని మంగళవారం నుండి ప్రారంభమైనదని, మంగళ వారం నాడు 7939 మందికి రూ .7.90 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకులలో జమ చేశారని వెల్లడించింది.