
ఈ నెల 7వ తేదీ సోమవారం నాడు వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తరు. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ మీటింగ్ లో ఈ ఏడాది రెండవ విడత రైతుబంధు సహాయం పై సిఎం నిర్ణయం తీసుకుంటరు. నిధుల విడుదల, పంపిణీ పై చర్చిస్తరు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటరు.